ఇండియన్ మోస్ట్ ట్రస్టెడ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌గా డా.ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు

by Batti.Sumithra |

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ప్రముఖ సంతానోత్పత్తి నిపుణురాలు, ప్రశాంతి హాస్పిటల్ యజమాని, మదర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకురాలు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఈ.ప్రశాంతి రెడ్డి ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును అందుకున్నారు.

ఇండియన్ మోస్ట్ ట్రస్టెడ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌గా డా.ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ప్రముఖ సంతానోత్పత్తి నిపుణురాలు, ప్రశాంతి హాస్పిటల్ యజమాని, మదర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకురాలు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఈ.ప్రశాంతి రెడ్డి ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును అందుకున్నారు. 'ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఆఫ్ ది ఇయర్–2026' అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని 'ది పార్క్' హోటల్‌లో నిర్వహించిన 'ప్రైడ్ ఆఫ్ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అండ్ సమ్మిట్–2026' కార్యక్రమంలో సినీ నటి, మాజీ రాజ్యసభ సభ్యురాలు జయప్రద చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.

సంతానలేమితో బాధపడుతున్న వేలాది దంపతులకు అత్యాధునిక వైద్య సేవలు, నమ్మకమైన చికిత్స అందిస్తూ విశేష సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ ప్రశాంతి రెడ్డికి ఈ గౌరవం దక్కడం పట్ల వైద్య వర్గాలు, సహచర వైద్యులు, రోగులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆమె వైద్య సేవలకు ఇది మరో విశిష్ట గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు.

Next Story