- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Piyush Goyal: భారత్‌కు ఇచ్చే రేటింగ్స్‌లో గ్లోబల్ సంస్థల పక్షపాతం
వారి ఉద్దేశాలను ప్రశ్నించడం లేదని, అయితే భారత్ విషయంలో వారి వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ బలాన్ని, వృద్ధి సామర్థ్యాన్ని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇప్పటికీ పూర్తిగా గుర్తించడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎస్అండ్‌పీ, మూడీస్, ఫిచ్ వంటి సంస్థలు భారత్‌కు న్యాయమైన రేటింగ్‌లు ఇవ్వలేదని, దేశం సాధించిన ఆర్థిక పురోగతి, బలమైన పునాదులు, సార్వభౌమ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశాయని అన్నారు. వారి ఉద్దేశాలను ప్రశ్నించడం లేదని, అయితే భారత్ విషయంలో వారి వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చాలా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు భారత్‌ను 'ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్'లో దిగువ స్థాయిలో ఉంచుతున్నాయి. రేటింగ్ ప్రక్రియల్లో మరింత పారదర్శకత, నిష్పాక్షికత అవసరమని కూడా ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే భారతీయ రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ దేశాల ఆర్థిక పరిస్థితులను మరింత సమతుల్యంగా అంచనా వేస్తోందని గోయల్ అభిప్రాయపడ్డారు. అయితే, గడిచిన కొద్ది నెలలుగా పరిస్థితుల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఎస్అండ్‌పీ, మార్నింగ్‌స్టార్ డీబీఆర్ఎస్, జపాన్‌కు చెందిన ఆర్అండ్ఐ భారత్ సార్వభౌమ రేటింగ్‌ను మెరుగుపర్చాయని ఆయన పేర్కొన్నారు.






