- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముదిగొండ గ్రంథాలయానికి మహర్దశ
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని గ్రంథాలయానికి మహర్దశ పట్టుకుంది.

దిశ, ఖమ్మం కల్చరల్ : ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని గ్రంథాలయానికి మహర్దశ పట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సహకారంతో పాత గ్రంథాలయ స్థలంలో నూతన గ్రంథాలయం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం నుంచి రెండు కుంటల స్థలాన్ని గ్రంథాలయానికి కేటాయించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. ఖాదర్ బాబా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో నూతన గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని పలు గ్రంథాలయాలను సందర్శిస్తూ వాటి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి జరగనుంది. ఈ సందర్భంగా ముదిగొండ గ్రంథాలయానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. ఖాదర్ బాబా శనివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు జె. భాస్కరరావు, సుమలత, శ్రీనివాసరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.






