- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటాం: జీసీడీవో
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని జీసీడీవో అస్రా ఖాద్రీ తెలిపారు.

దిశ, మిడ్జిల్: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని జీసీడీవో అస్రా ఖాద్రీ తెలిపారు. శనివారం మిడ్జిల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆమె సందర్శించారు. ఉపాధ్యాయులే విద్యార్థులకు వంట చేశామని కథనంతో స్పందించారు. మొహరం సందర్భంగా సమాచారం లేకుండా విధులకు గైరాజరైన వంట మహిళలపై విచారణ చేశారు. వంట మహిళలు ఈరోజు కూడా సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మా కొట్టినట్లు గుర్తించారు. గత రెండు రోజుల నుండి వంట మహిళలు రాకపోవడంతో విద్యార్థులకు భోజనం ఏర్పాటు ఉపాధ్యాయులే వంట చేస్తున్నారని గుర్తించారు. గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్ తో కలిసి తాత్కాలికంగా వంట మహిళలను ఏర్పాటు చేశారు. సమాచారం ఇవ్వకుండా వంట మహిళలు విధులకు రాకపోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరు , విద్యార్థుల హాజరు వివరాలను, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదికను అందజేస్తామన్నారు. కేజీబీవీ ప్రత్యేక అధికారి కవిత, వార్డు సభ్యులు వెంకటయ్య ఉన్నారు.






