- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల్ని పరామర్శించడానికి వెళ్లారా? రౌడీయిజం చేయడానికి వెళ్లారా? : హోంమంత్రి అనిత
ఉండవల్లిలో రైతుల్ని కలిసేందుకు వైసీపీ నేతలు వెళ్లడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్లదాడి, పలువురికి గాయాలవ్వడంతో హైటెన్షన్ నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉండవల్లిలో రైతుల్ని కలిసేందుకు వైసీపీ నేతలు వెళ్లడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్లదాడి, పలువురికి గాయాలవ్వడంతో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోంమంత్రి అనిత స్పందించారు. అమరావతిలో పర్యటించేందుకు వైసీపీ నేతలకు కనీస అర్హత కూడా లేదన్నారు. వైసీపీ నేతల తీరు చూస్తే.. రైతులను పరామర్శించేందుకు వెళ్ళారా లేక రౌడీయిజం చేయడానికి వెళ్లారా? అని సందేహం కలుగుతోందన్నారు. వైసీపీ నేతలు అక్కడికి వెళ్తే సమస్య వస్తుందని పోలీసులు ముందే చెప్పారన్న హోంమంత్రి.. అక్కడున్న రైతుల్లో 90 శాతం మంది రాజధానికోసం భూములిచ్చినవారే ఉన్నారన్నారు. వైసీపీ నేతల్లో గూండాలు కూడా ఉన్నారని అనిత ఆరోపించారు. రౌడీయిజం చేయడానికే వారిని వెంటపెట్టుకుని వెళ్లారన్నారు. వారిలో ఎంతమంది రౌడీషీటర్లున్నారో పోలీసుల వద్ద లిస్టు ఉందన్నారు.
నేడు జరిగిన ఘటనపై వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి.. నిందితులను శిక్షిస్తామన్నారు. అమరావతి ప్రజల కలల రాజధాని అని, రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతుందని మరోసారి హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. 2027 నాటికి రాజధాని నిర్మాణం పూర్తికావాలని అహర్నిశలు కష్టపడుతున్నామని తెలిపారు. మొదట అమరావతినే రాజధానిగా అంగీకరించి, తర్వాత మూడు రాజధానులని డ్రామాలాడారని దుయ్యబట్టారు. ఇప్పుడు మావిగన్ అంటూ.. మళ్లీ అమరావతిలో ఏ ముఖం పెట్టుకుని పర్యటిస్తారని ప్రశ్నించారు. అమరావతి పూర్తయితే తమకు మనుగడ ఉండదనే వైసీపీ ఈ డ్రామాలు చేస్తోందని, ఇది ముమ్మాటికీ రైతులపై రౌడీ మూకలతో చేసిన దాడేనన్నారు. గత ప్రభుత్వం చేసిన నీఛ రాజకీయాలు తాము చేయడం లేదన్న హోంమంత్రి.. రైతులపై జరిగిన దాడిపై ఎంక్వైరీ వేస్తామని తెలిపారు.






