ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్..

by Kodari Anjali |   (  Updated:2026-06-27 14:00:45  IST  )

హస్మత్‌పేటలో జరిగిన కూల్చివేతలపై బాధితులను పరామర్శించేందుకు వెళ్తొన్న ఈటలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్..
X

దిశ, మేడ్చల్: హస్మత్‌పేటలో ఉదయం జరిగిన కూల్చివేతల బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను మేడ్చల్ పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేశారు. బాధితులను కలిసేందుకు వెళ్లకుండా పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకుని బయటకు వెళ్లనీయకుండా నిర్బంధించారు. హస్మత్‌పేటలో జరిగిన కూల్చివేతలపై బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్న సమయంలో ఈ చర్య చేపట్టినట్లు సమాచారం.

Next Story