అమరావతిలో వైసీపీ నేతలపై దాడి.. మాజీ సీఎం జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-27 15:22:43  IST  )

అమరావతి ఉండవల్లిలో జరుగుతున్న భూసేకరణ ప్రక్రియను పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతలపై దాడి జరిగింది. గతంలో అమరావతిపై విషం చిమ్మిన విషయాన్ని గుర్తు చేసుకుని స్థానిక రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కార్లపై రాళ్ల దాడి చేశారు...

jagan key orders to ycp party cadre
X

jagan key orders to ycp party cadre

దిశ, వెబ్ డెస్క్: అమరావతి ఉండవల్లి(Undavalli)లో జరుగుతున్న భూసేకరణ ప్రక్రియను పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతల(Ycp Leaders)పై దాడి జరిగింది. గతంలో అమరావతి(Amaravati)పై విషం చిమ్మిన విషయాన్ని గుర్తు చేసుకుని స్థానిక రైతులు(Formers), ప్రజలు(People) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కార్లపై రాళ్ల దాడి చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Ycp Chief Jagan Mohan Reddy) మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై టీడీపీ(Tdp) వాళ్లే దాడి చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు పాలన చేస్తున్నారా, గుండాగిరి చేస్తున్నారా మండిపడ్డారు. అందరూ చూస్తుండగానే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. వాస్తవాలు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో తమ పార్టీ నేతలపై దాడి చేశారని వ్యాఖ్యానించారు. అమరావతిలో చేస్తున్న దారుణాలకు రైతులు బలి అవుతున్నారని ధ్వజమెత్తారు. రాజధాని రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడటం తప్పా అని ప్రశ్నించారు. అమరావతిలో ఇప్పటికే వేల ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. బినామీలకు పంచేందుకే భూసేకరణ చేపట్టారని వ్యాఖ్యానించారు.

Next Story