మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు.. రూ.36 వేల జరిమానా

by Kodari Anjali |

పట్టణంలోని పాత బజారులో ఉన్న ఆరు వైన్స్ షాపులు, మూడు బార్ క్యాంటీన్లలో శనివారం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు.. రూ.36 వేల జరిమానా
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: పట్టణంలోని పాత బజారులో ఉన్న ఆరు వైన్స్ షాపులు, మూడు బార్ క్యాంటీన్లలో శనివారం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలు, వంటశాలల నిర్వహణ, ఆహార నిల్వ విధానాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాల వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనలు పాటించని క్యాంటీన్లను గుర్తించి, సంబంధిత యజమానులకు మొత్తం రూ.36 వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని యజమానులకు సూచించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ దామోదర్, ల్యాబ్ టెక్నీషియన్ నరేష్, శాంపిల్ అసిస్టెంట్ మల్లికార్జున్, జవాన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story