- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
పెండింగ్ కేసుల దర్యాప్తులో నాణ్యతకు పెద్దపీట వేస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు.

దిశ, పాపన్నపేట : పెండింగ్ కేసుల దర్యాప్తులో నాణ్యతకు పెద్దపీట వేస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం పాపన్నపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణ, స్వాధీన వాహనాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేసి, బస్వరాజ్ కు రివార్డ్ మంజూరు చేశారు. శాఖ అందించిన సామగ్రిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించి అన్ని రకాల విధుల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని, ప్రస్తుతం నేర్చుకుంటున్న అంశాలు సేవా కాలమంతా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ ప్రతి కేసులో శాస్త్రీయ, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. మిస్సింగ్, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక కార్యాచరణతో త్వరగా పరిష్కరించాలని, ఆస్తి సంబంధిత నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని, విలేజ్ పోలీస్ అధికారులు తమ గ్రామాలపై పూర్తి అవగాహనతో గ్రామ పెద్దలు, యువతతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రాజా శేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, సందీప్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.






