- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RS ప్రవీణ్ భద్రత తగ్గించడం దుర్మార్గం: హరీష్‌రావు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గించడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేధికగా స్పందించారు. స్కాంలు, అవినీతిపై ప్రవీణ్ కుమార్ పోరాడుతున్నారని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గించడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేధికగా స్పందించారు. స్కాంలు, అవినీతిపై ప్రవీణ్ కుమార్ పోరాడుతున్నారని చెప్పారు. 26ఏళ్లుగా పోలీసుగా ప్రవీణ్ సమాజానికి సేవ చేశారని చెప్పారు. రాజకీయ కక్షతోనే ఆయనకు భద్రత తొలగించారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు ప్రభుత్వ భద్రత, వాహనాలు కల్పిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానీ ప్రజా సమస్యలపై పోరాడుతున్న, పలుమార్లు ప్రాణహాని హెచ్చరికలు ఎదుర్కొన్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను తగ్గించడం అత్యంత అన్యాయం అని చెప్పారు. భద్రతను తగ్గించినంత మాత్రాన ప్రవీణ్‌కుమార్ ఆత్మస్థైర్యాన్ని, పోరాటస్ఫూర్తిని దెబ్బతీయలేరని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను అణచివేసే కక్షపూరిత రాజకీయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కు తగిన భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.






