- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీచరణ్‌కు శిక్ష పడాలి: రాధా గాయత్రి తల్లి సత్యవతి
విశాఖ టెకీ రాధా గాయత్రి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తమ కూతురుని అల్లుడు శ్రీచరణే చంపాడని రాధా గాయాత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ టెకీ రాధా గాయత్రి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తమ కూతురుని అల్లుడు శ్రీచరణే చంపాడని రాధా గాయాత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆయనకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం విశాఖ సీపీని రాధా గాయత్రి తల్లిదండ్రులు కలిశారు. విశాఖలోనూ రాధాగాయత్రి కేసును విచారించాలని వినతి పత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేశారు. రాధాగాయత్రి తల్లి సత్యవతి మాట్లాడుతూ శ్రీచరణ్‌కు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. పథకం ప్రకారమే తన కూతురిని శ్రీచరణ్ చంపేశారని ఆరోపించారు.
శ్రీచరణ్ కనిపించకపోవడంతో పలు అనుమానాలు
కాగా రాధా గాయత్రి ముస్పోరీలోని నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో అక్కడి పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేసు నమోదు అయినప్పటి నుంచి శ్రీచరణ్ కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా రాధా గాయత్రి దశదిన కర్మకు కార్యక్రమానికి శ్రీచరణ్ హాజరుకాకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. అటు గాయత్రి తల్లిదండ్రులు సైతం శ్రీచరణ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాధా గాయత్రిని శ్రీచరణే చంపేసి కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తన తరపున లాయర్‌ను కూడా పెట్టుకున్నారని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు నుంచి శ్రీచరణ్ తప్పించుకోకూడదని, విశాఖలోనూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.






