మినీ టాటా ఏస్ ఢీకొని బాలుడు మృతి

by Taduka Kalyani |

ముషీరాబాద్ భోలక్ పూర్ లోని గంగపుత్ర సంఘం కార్యాలయం ఎదురుగా తన అమ్మమ్మ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న బాలుడు ని మినీ టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే శ్రేయాన్ష్ (4) మృతి చెందాడు.

మినీ టాటా ఏస్ ఢీకొని బాలుడు మృతి
X

దిశ, రాంనగర్: ముషీరాబాద్ భోలక్ పూర్ లోని గంగపుత్ర సంఘం కార్యాలయం ఎదురుగా తన అమ్మమ్మ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న బాలుడు ని మినీ టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే శ్రేయాన్ష్ (4) మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. జనావాసాల మధ్యన కొనసాగుతున్న స్క్రాప్ దుకాణాల వల్ల నిత్యం అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలు వేగంగా రాకుండా, అక్రమ పార్కింగ్ లు లేకుండా నిరంతర చర్యలు చేపట్టాలని అదేవిధంగా స్క్రాప్ దుకాణాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. చిక్కడపల్లి, గాంధీనగర్ ఏసీపీలు రన్ వీర్ రెడ్డి, యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి, సీఐ నదీమ్ హుస్సేన్ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి సంజాయించినప్పటికీ వారు వినకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని బైఠాయించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా కలిసి భోలక్ పూర్ లోని అక్రమ పార్కింగ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ముషీరాబాద్ పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Next Story