విజయ్ ప్రభంజనం వేళ వైరల్‌గా మారిన బండ్ల గణేష్ ట్వీట్

by Pulgam srinivas |   (  Updated:2026-05-04 10:48:22  IST  )

బండ్ల గణేష్ తాజాగా త్రిషను ట్యాగ్ చేస్తూ “ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది… కంగ్రాట్స్ త్రిష” అని పేర్కొన్నారు.

విజయ్ ప్రభంజనం వేళ వైరల్‌గా మారిన బండ్ల గణేష్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఈరోజు తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అనూహ్యంగా దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్‌ను చూస్తే విజయ్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాంటి సమయంలో త్రిష పేరు కూడా మారుమోగుతోంది. చాలాకాలంగా విజయ్–త్రిష గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో విజయ్ భార్యతో విడాకులు తీసుకోవడం, అలాగే వీరిద్దరూ కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరుకావడం వంటి అంశాలు ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి.

ఇక ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, అదే రోజు త్రిష పుట్టినరోజు కావడంతో ఆమె తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకుని, తిరిగి విజయ్ ఇంటికి వెళ్ళింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. త్రిషను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్ట్‌లో, “ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది… కంగ్రాట్స్ త్రిష” అని పేర్కొన్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

తమిళనాడులో కొత్త ట్రెండ్.. విజయ్ ఫోటో చీరతో మహిళ సందడి!

Next Story