తమిళనాడులో కొత్త ట్రెండ్.. విజయ్ ఫోటో చీరతో మహిళ సందడి!

by Ramesh Naini |

తమిళనాట ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. టీవీకే గెలుపు ఖాయం కావడంతో ఓ మహిళా అభిమాని వినూత్న రీతిలో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

తమిళనాడులో కొత్త ట్రెండ్.. విజయ్ ఫోటో చీరతో మహిళ సందడి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం ఐదు రాష్ట్రాల్లో పార్టీలు స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నాయి. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎటువంటి మార్పు లేకుండా ప్రస్తుత ముఖ్యమంత్రులే మళ్లీ పగ్గాలు చేపట్టనున్నారు. బెంగాల్‌లో బీజేపీ, కేరళంలో కాంగ్రెస్ కూటమి (యూడీఎఫ్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ముందంజలో ఉంది. అయితే, ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది మాత్రం తమిళనాడు రాష్ట్రమే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘దళపతి’ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK - తమిళగ వెట్రి కజగం) పార్టీ సునామీ సృష్టించింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ రాజకీయ ముఖచిత్రాన్నే ఈ ఎన్నికలు సమూలంగా మార్చేశాయి. కౌంటింగ్ సరళిని బట్టి విజయ్ పార్టీ ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్క్) కు అతి చేరువలో ఉండి చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.

కొత్త ట్రెండ్ షురూ.. దళపతి చీరలో మహిళ హంగామా!

తమిళనాడులో విజయ్ పార్టీ సృష్టించిన సునామీతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఈ క్రమంలో తమిళనాట ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. టీవీకే గెలుపు ఖాయం కావడంతో ఓ మహిళా అభిమాని వినూత్న రీతిలో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఏకంగా దళపతి విజయ్ ఫోటో, టీవీకే పార్టీ ఫ్లాగ్ ముద్రించి ఉన్న చీరను ధరించి ఆమె చేసిన సందడి ఇప్పుడు సర్వత్రా ఆకర్షిస్తోంది. అందరికంటే భిన్నంగా ఇలా తన అభిమాన నాయకుడి ఫోటో ఉన్న చీరకట్టుతో విజయ్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపిన వైనం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, టీవీకే సునామీ ఎఫెక్ట్ కు అద్దం పడుతోంది.

Next Story