- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం: సీఎం స్టాలిన్‌ను ఓడించిన TVK అభ్యర్థి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఓటమి పాలయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఓటమి పాలయ్యారు. ఇది దేశ రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విజయం సాధించారు. గత మూడు ఎన్నికలుగా కొలత్తూరు నుండి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న స్టాలిన్‌కు, ఈసారి టీవీకే అభ్యర్థి నుండి ఊహించని స్థాయిలో పోటీ ఎదురైంది. చివరకు టీవీఎస్ అభ్యర్థి వీఎస్ బాబు స్పష్టమైన ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన తొలి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రిని ఢీకొనే స్థాయి ప్రభావాన్ని చూపడం చర్చనీయాంశంగా మారింది. కొలత్తూరులో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబుకు యువత, మార్పు కోరుకునే ఓటర్లు పెద్దపీట వేసినట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకత..?
ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే వెనుకంజలో ఉండటంపై విశ్లేషకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమా లేదా కొత్త పార్టీ ప్రభావమా అనే చర్చ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే కూటమి, ప్రత్యర్థి పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా, ఏకంగా ముఖ్యమంత్రే తన స్థానంలో ఓటమి పాలవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మరోవైపు, టీవీకే కార్యకర్తలు ఈ ట్రెండ్స్‌తో సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతానికి కౌంటింగ్ కొనసాగుతోంది.






