WTC FINAL: టీమిండియా తుది జట్టు ఇదే

by  |
WTC FINAL: టీమిండియా తుది జట్టు ఇదే
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నది. ఇప్పటికే ఇరు జట్లు మ్యాచ్ జరుగనున్న సౌతాంప్టన్ చేరుకున్నాయి. టీమ్ ఇండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతూ పూర్తిగా మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నది. కివీస్ జట్టు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడి ఆత్మవిశ్వాసంతో కనపడుతున్నది. కాగా ఇరు క్రికెట్ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడబోయే 15 మందితో కూడిన జట్టును ప్రకటించాయి. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన కోహ్లీ కోలుకోవడం ఊరట కలిగించే విషయం. 15 మందిలో ఇద్దరు స్పిన్నర్లు, ఐదుగురు పేసర్లకు చోటు కల్పించింది. మ్యాచ్ రోజు పిచ్ స్వభావాన్ని పరిశీలించిన అనంతరం తుది జట్టులో ఎంత మంది పేసర్లు, స్పిన్నర్లను తీసుకుంటారనే విషయం తెలుస్తుంది. ఇక వికెట్ కీపర్లుగా పంత్, సాహను చేర్చారు. వీరిద్దరిలో పంత్‌కే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉన్నది. మరోవైపు గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేన్ విలియమ్‌సన్ కోలుకున్నాడు. వెన్నెముక గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమైన వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ కూడా జట్టులోకి వచ్చాడు. మిగతా అంతా దాదాపు ఇంగ్లాండ్‌తో ఆడిన తుది జట్టే ఉన్నది.

టీమ్ ఇండియా : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్దిమాన్ సాహ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్

న్యూజీలాండ్ : కేన్ విలియమ్‌సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కొలిన్ డి గ్రాండ్‌హోమ్. మ్యాట్ హెన్నీ, కైల్ జేమిసన్, టామ్ లేథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్

Next Story