అల్లర్లలో ఆ సీఐ పాత్ర.. సీట్‌కు మంత్రి అంబటి ఫిర్యాదు

by srinivas |
అల్లర్లలో ఆ సీఐ పాత్ర.. సీట్‌కు మంత్రి అంబటి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అల్లర్లు చెలరేగాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఎన్నికల అనంతరం పరస్పరం దాడులు చేసుకున్నాయి. చాలా ప్రాంతాల్లో కర్రలు, రాళ్లు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రభుత, ప్రైవేటు ఆస్తులు సైతం ధ్వంసం అయ్యాయి. చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి గాల్లో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేశారు. వివిధ చోట్ల జరిగిన ఘటనల్లో నిందితులను అరెస్ట్ చేశారు. పలువురు పరారీ అయ్యారు.

అయితే ఈ ఘటనపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. దీంతో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. అటు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఘర్షణలు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. అల్లర్లకు గల కారణాలపై స్థానికుల నుంచి సమాచారం సేకరించారు.

అయితే సిట్ అధికారులను మంత్రి అంబటి కలిశారు. ఓ పోలీస్‌పై ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి రూరల్ నియోజకవర్గంలో చెలరేగిన ఘర్షణపై విచారణ చేపట్టాలని కోరారు. అల్లర్లలో రూరల్ సీఐ పాత్ర ఉందని తెలిపారు. ఆయనపైనా విచారణ జరపాలని అంబటి కోరారు. తన నియోజకవర్గంలో అల్లర్లకు కారణం ఆయనేనని తెలిపారు. టీడీపీ నాయకులతో పోలీసులు కుమ్మక్యయ్యారని ఆరోపించారు. మూడు సార్లు తాను ఎన్నికల్లో పోటీ చేశానని, కానీ ఎప్పుడు ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెప్పారు. అల్లర్లను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారన్నారు. తొండపి గ్రామంలో జరిగిన అరాచకానికి అక్కడి వారంతా గ్రామం విడిచి వెళ్లిపోయారని..వారిని తిరిగి తీసుకొచ్చేలా పోలీసులను ఆదేశించాలని సిట్ అధికారులను మంత్రి అంబటి రాంబాబు కోరారు.



Next Story

Most Viewed