బాయ్ ఫ్రెండ్‌తో అవి నేర్చుకుంటున్న యంగ్ యాంకర్.. సుమకే షాకిచ్చిందిగా!

by Mamatha |
బాయ్ ఫ్రెండ్‌తో అవి నేర్చుకుంటున్న యంగ్ యాంకర్.. సుమకే షాకిచ్చిందిగా!
X

దిశ,వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ గురించి సుపరిచితమే. ఎన్నో షో లలో యాంకరింగ్ చేసి మంచి పేరు సంపాదించుకుంది. యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. కేరళ నుంచి వచ్చి తెలుగువారింటి కోడలైన సుమ కనకాల తెలుగు వారి ఆత్మీయురాలిగా మారిపోయింది. తను వేసే పంచ్ డైలాగ్స్ కి పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు కదా. పలు షో లలో యాంకరింగ్ చేసి బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ప్రజెంట్ సుమ కనకాల యాంకరింగ్ చేస్తున్న షోలలో 'సుమ అడ్డా' ఒకటి. ఈ వారం ఆ షోకి యాంకర్స్ గాయత్రి భార్గవి, శిల్పా చక్రవర్తి, గీతా భగత్, విద్య వచ్చారు. షో లో సుమ మీద పంచ్ డైలాగ్స్ పడ్డాయి.

అయితే ఈ క్రమంలో ఆమె మీద పడిన పంచ్‌లకు ఈ పంచింగ్ ఫలక్ నామాకే పంచ్' అని డైలాగ్ చెబుతారు. మే 25న టెలికాస్ట్ కానున్న 'సుమ అడ్డా' షోకి నలుగురు యాంకర్లు అతిథులుగా వచ్చారు. లేటెస్ట్‌గా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ క్రమంలో గాయత్రీ భార్గవి, శిల్పా చక్రవర్తి స్టేజి మీదకు వచ్చారు. వాళ్లని చూసిన సుమ ''ఇవాళ నాకు కాంపిటీషన్'' అని అనగానే '' టక్కున సుమ గారికి సుమ గారే కాంపిటీషన్! ఒక ఓ వేసుకోండి అందరూ'' అని శిల్పా చక్రవర్తి పొగిడింది.

ఈ షోలో ఒక స్టూడెంట్ పుషప్స్ చేస్తుంటే తనకు బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వచ్చాడని శిల్పా చక్రవర్తి చెప్పింది. ''పెళ్లైతే నీకు ఇద్దరు పిల్లలు పుట్టేవారు. మళ్లీ బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వస్తున్నాడట'' అని సుమ అనడంతో ఒక్కసారిగా షాక్ అయింది. మళ్లీ నవ్వుతూ ఏమన్నదంటే.. ''ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదు మేడమ్'' అని గట్టిగా చెప్పింది. అంతే కాదు సుమకి మరో పంచ్ వేసింది. బాయ్ ఫ్రెండ్ తో అలా తిరగడానికి వెళ్లి డ్యాన్స్ చేశానని, ఆ తర్వాత ''ఊ ఆ'' అంటూ ఏం జరిగిందో చెప్పడానికి అందరికీ తెలిసేలా శిల్పా చక్రవర్తి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.

Next Story