గ్రామాలకు గ్రహణం వీడేది ఎప్పుడు..?

by Aamani |
గ్రామాలకు గ్రహణం  వీడేది ఎప్పుడు..?
X

దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని పలు గ్రామ పంచాయతీల పరిధిలో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నుండి నేటి పార్లమెంటు ఎన్నికలు అయిపోయే వరకు గ్రామాల్లో సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఉద్యోగులకు ఎన్నికల విధులు వాటి పేరుతోనే వారు కాలాన్ని గడిపేశారు. శాసనసభ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికలు అయిపోయే దాకా కాలం వెళ్లదీశారు. అధికారుల్లో కూడా అలసత్వం ఆవహించిందా? ప్రభుత్వం మారడం తో ఇంత నిర్లక్ష్యమా అని చాలా గ్రామాల్లోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మురుగునీటి పారుదల కాలువలను చూస్తే బిత్తర పోవాల్సిందే.కాలువల నిండా చెత్తాచెదారం మొలకెత్తిన గడ్డి నీరు పారకుండా అడ్డుగా ఉంది.ఇది ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనే కాదు మొత్తం 24 గ్రామాలలో ఏ గ్రామాన్ని చూసినా పారిశుద్ధ్యం లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి వీధిలో చెత్త చెదారం చేరి ఉంది. ఇక పైపులైన్ లీకేజీ లకు అడ్డే లేదు.

వేసవికాలంలో నీరును పొదుపుగా వాడండి నీరును వృధా చేయకండి అనే స్లొగన్స్ కాగితాల వరకే పరిమితమయ్యాయి. చాలా గ్రామాల్లో కనీసం వీధి దీపాలు కూడా వెలగడం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.,కరీంపేట గ్రామంలో దాదాపు పది రోజులపాటు వీధి దీపాలు వెలగలేదు రాజాపూర్ గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు .చీకట్లో బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది .ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ దానికి సరిపడా సిబ్బంది ఉన్నప్పటికీ విధుల పట్ల ఈ నిర్లక్ష్యం ఎందుకు? దేనికి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న పారిశుద్ధ్య కార్మికుల తోటే ,పనులు చేయించాల్సిన పంచాయతీ కార్యదర్శుల పనితనం కనిపించడం లేదు. ఇష్టానుసారంగా వెలుస్తున్న నిర్మాణాలు గ్రామీణ ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు రోడ్లను ఆక్రమించుకునే విధంగా జరుగుతున్న సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అధికారులపై అజమాయిషీ లేకన లేదంటే ఎలా ఉన్నా నడుస్తదిలే అని నిర్లక్ష్యమా! వచ్చేది వర్షాకాలం ఇదే పరిస్థితి కొనసాగితే దోమల బెడద విపరీతంగా ఉండి సంపాదించిన సగం సొమ్ము కంటే ఎక్కువగా ఆసుపత్రుల పాలు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గోతులను కూడా పూడ్చుకోలేని పరిస్థితుల్లో గ్రామపంచాయతీలు ఉన్నాయా? ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీ నిధులు ఎందుకు రావడం లేదు. పుట్టెడు సమస్యలతో గ్రామాలు కొట్టుమిట్టాడుతుంటే పరిపాలించే సర్పంచుల కాలం పోయి ప్రత్యేక అధికారుల కాలం వచ్చినా ఎందుకు కనీస అవసరాల పైన వారు దృష్టి పెట్టడం లేదని విమర్శ ఉంది.పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో గ్రామాల పరిస్థితి ఏంటి ఇక గ్రామాలకు గ్రహణం పట్టినట్లే అని ప్రజలు చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed