స్వాతి మలివాల్ దాడి కేసు.. భిభవ్ కు ఐదురోజుల పోలీస్ కస్టడీ

by Shamantha N |
స్వాతి మలివాల్ దాడి కేసు.. భిభవ్ కు ఐదురోజుల పోలీస్ కస్టడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: స్వాతి మలివాల్ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ భిభవ్ కుమార్ కు ఐదు రోజుల కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు. శనివారం అర్ధరాత్రి కస్టడీ గురించి వాదనలు వింది కోర్టు. ఆ తర్వాత ఐదురోజుల పోలీస్ కస్టడీ విధించింది.

బిభవ్‌ను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. ఇది తీవ్రమైన కేసు అని.. దెబ్బలు గట్టిగా తగిలాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు అభియోగాలు మోపారు. భిభవ్ కుమార్ విచారణకు సహకరించడం లేదని.. పొంతన లేని సమాధానాలు ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. విచారణ కోసం ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. ఢిల్లీ కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.

రిమాండ్ దరఖాస్తులో మేజిస్ట్రేట్ ముందు మలివాల్ వాంగ్మూలం వైద్యుల నివేదికను కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ తెలిపిన వివరాల ప్రకారం భిభవ్ ఆమెపై ఏకపక్షంగా దాడి చేశాడని నివేదికలో పేర్కొన్నారు. టేబుల్ పై తలను పెట్టి విచక్షణరహితంగా కొట్టాడని తెలిపారు పోలీసులు.

దాడి జరిగిన ప్రదేశంలో ఉన్న వీడియోలను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు ఆరోపించారు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉన్న ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే దాడి జరిగిన సమయంలో.. ఇందులో ఉన్న ఫుటేజ్ ఖాళీగా ఉన్నాయని గుర్తించామన్నారు. ఇందులోని వీడియోలను తొలగించి పోలీసులకు అందించారని అన్నారు. సిట్టింగ్ ఎంపీపై దాడి జరిగిందని.. దాడి వెనుక ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి విచారణ అవసరం అని పోలీసులు తెలిపారు. మరోవైపు, తన మొబైల్ ఫార్మాట్ చేశనని భిభవ్ కుమార్ ఇప్పటికే అంగీకరించారు.

Next Story

Most Viewed