రాహుల్ గాంధీ సభలో స్టేజీ వైపు దూసుకొచ్చిన జనం.. తొక్కిసలాట పరిస్థితి

by Prasad Jukanti |
రాహుల్ గాంధీ సభలో స్టేజీ వైపు దూసుకొచ్చిన జనం.. తొక్కిసలాట పరిస్థితి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉమ్మడిగా పాల్గొన్న సభలో హంగామా చోటు చేసుకుంది. జనమంతా ఒక్కసారిగా స్టేజి వైపు దూసుకురావడంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ నియోజకవర్గం కోసం ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రయాగ్ రాజ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో సభా వద్దకు చేరుకున్న సమయం నుంచి సభకు వచ్చిన వారు హంగామా సృష్టించారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు జనం దూసుకురావడంతో ల్యాండింగ్ కు ఇబ్బంది ఏర్పడింది. అతికష్టం మీద ఎలాగోలా ల్యాండ్ అయి స్టేజీపైకి రాహుల్ చేరుకున్నారు. ఈ క్రమంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా బారికేట్లు ధ్వంసం చేసి మరోసారి జనాలు స్టేజీ వద్దకు దూసుకువచ్చారు. దీంతో గందరగోళం మధ్యలోనే రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నామని యూపీఓలో ఈసారి బీజేపీకి ఒక్క సీటు మాత్రమే దక్కబోతున్నదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన వేలాది మంది కార్యకర్తలకు ధన్యవాదాలు. పోలింగ్ బూత్‌ల వద్ద బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు వ్యతిరేకంగా నిలబడాలని నేను మిమ్మల్ని కోరాలనుకుంటున్నాను. ఇక్కడి అభ్యర్థిని 5 లక్షల ఓట్లతో గెలిపించాలని అని పిలుపునిచ్చారు. కాగా సభలో ఏర్పడిన గందరగోళానికి పోలీసులు వైఫల్యమే అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సభికులను అదుపు చేయడంలో వారు విఫలం అయ్యారని విమర్శిస్తున్నారు.



Next Story

Most Viewed