ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్ గా చేస్తాం : మంత్రి జూపల్లి

by Kalyani |
ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్ గా చేస్తాం : మంత్రి జూపల్లి
X

దిశ, కొల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్ గా తయారు చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద మారు, పెద్ద దగడ, సింగోటం , కొండూరు, స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…మొదటగా విద్య, వైద్యానికే ప్రాముఖ్యత ఇస్తానని, దానికోసం ఎంతైనా ఖర్చు చేస్తానని అన్నారు. విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకు పంపించి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని, ప్రభుత్వ పాఠశాలను గురుకుల మోడల్ స్కూల్ గా తయారు చేస్తానని తెలిపారు.

విద్యార్థులకు చదువుతోపాటు మార్నింగ్ టిఫిన్, ఆటలాడుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా ప్రజలు ఏ జబ్బు వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్ కు పోయి లక్షల లక్షల ఖర్చు చేసుకోవద్దని ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల వరకు ప్రభుత్వమే ఖర్చుపెట్టి ఆరోగ్యం బాగుచేస్తుందని ప్రజలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రత్నగిరి ఫౌండేషన్ ధర్మ తేజ, పెంట్లవెల్లి మండల ప్రెసిడెంట్ నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed