- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
backwater : ప్రాణహిత బ్యాక్ వాటర్ తో మునిగిన పత్తి పంటలు
by Sridhar Babu |
ప్రాణహిత బ్యాక్ వాటర్ వల్ల బెజ్జూరు మండలంలోని తలాయి, థిక్కపల్లి, భీమారం, పాపన్నపేట, మొగవెళ్లి, సోమిని గ్రామాల్లో పత్తి చేలు నీట మునిగి రైతులు పంటలు నష్టపోయారు.

X
దిశ, బెజ్జూర్ : ప్రాణహిత బ్యాక్ వాటర్ వల్ల బెజ్జూరు మండలంలోని తలాయి, థిక్కపల్లి, భీమారం, పాపన్నపేట, మొగవెళ్లి, సోమిని గ్రామాల్లో పత్తి చేలు నీట మునిగి రైతులు పంటలు నష్టపోయారు. ప్రాణహిత బ్యాక్ వాటర్ వల్ల బెజ్జూర్ మండలంలో వెయ్యి ఎకరాల్లో పత్తి పంట నష్టపోయినట్లు ప్రాణహిత వరద బాధితులు తెలిపారు. పత్తి పంటల కోసం చేసిన ఖర్చులు నష్టపోయినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి వేసిన పత్తి పంటలు ప్రాణహిత వరదల వల్ల నీట మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంట నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని బెజ్జూర్ మండల వాసులు కోరుతున్నారు.
- Tags
- backwater
Next Story






