- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనుబోతులగూడెంలో పోడు భూముల వివాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో పోడు భూముల వివాదం నేపథ్యంలో ఇటీవల అటవీశాఖ సిబ్బంది, ఆదివాసుల మధ్య చోటుచేసుకున్న ఘటనపై సోమవారం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దిశ, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో పోడు భూముల వివాదం నేపథ్యంలో ఇటీవల అటవీశాఖ సిబ్బంది, ఆదివాసుల మధ్య చోటుచేసుకున్న ఘటనపై సోమవారం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, జిల్లా అటవీశాఖ అధికారి విక్రమ్ సింగ్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో) రాహుల్, ఎఫ్‌డీవో బాబు తదితర అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌తో పాటు గ్రామస్థుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోడు భూముల సమస్య, అటవీ భూముల పరిరక్షణ, ఆదివాసుల జీవనాధారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర సమాచారం సేకరించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేసి తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ.. గిరిజనుల హక్కులను పరిరక్షించే చట్టాలకు అనుగుణంగా సమగ్ర దర్యాప్తు నిర్వహించి, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.






