23 ఏళ్ల పగ.. కట్ చేస్తే ఘోర హత్య: పూణే టన్నెల్ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు!

by Malleboina Mahesh |

23 ఏళ్ల నాటి తండ్రి హత్యకు రిబెంజ్.. పగతో రగిలిపోయిన కొడుకు దారుణ హత్య! పూణే టన్నెల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు!

23 ఏళ్ల పగ.. కట్ చేస్తే ఘోర హత్య: పూణే టన్నెల్ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు!
X

దిశ, వెబ్ డెస్క్: తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకున్న ఓ యువకుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఘోర హత్య చేశాడు. ఈ 23 ఏళ్ల పగ కథ పూణేలో కలకలం రేపింది. పూణే టన్నెల్ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులకు ఈ షాకింగ్ విషయాలు తెలిశాయి. వివరాల్లోకి వెళితే.. నిందితుడు తాను ఆరు నెలల పసిపాప గా ఉన్నప్పుడు తన తండ్రిని దారుణంగా అంతమొందించిన సంజయ్ బాబూరావు కాడు-దేశ్‌ముఖ్ (40) అనే వ్యక్తిపై గత 23 ఏళ్లుగా కక్ష పెంచుకున్నాడు. మంథన్ వైద్య (24) అనే యువకుడు కాడు-దేశ్‌ముఖ్ అనే వ్యక్తిని జూలై 11న పాశవికంగా హతమార్చాడు. పూణే జిల్లా భోర్ తాలూకాలోని పాత కాట్రాజ్ టన్నెల్ సమీపంలో పదునైన ఆయుధాలతో తీవ్ర గాయాలతో పడి ఉన్న సంజయ్ మృతదేహాన్ని గుర్తించిన రాజ్‌గఢ్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై పూణే రూరల్ లోకల్ క్రైమ్ బ్రాంచ్ (LCB) అధికారులు సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టి, మంథన్ వైద్య, అతని సహచరుడు సౌరభ్ పరదేశిని ప్రధాన నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. చిన్నతనంలో తండ్రిని పొట్టనబెట్టుకున్న వ్యక్తినే లక్ష్యంగా చేసుకుని, సరైన సమయం చూసి ప్లాన్ ప్రకారమే ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Next Story