- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెకండ్ ఇన్నింగ్స్‌లో అక్కినేని కోడలు హవా.. కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్న శోభిత!
సైన్స్ ఫిక్షన్ మూవీ ‘వెట్టువమ్’లో ఆర్య సరసన ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోగా, తాజాగా, శోభిత కోలీవుడ్‌లో మరొక బంపర్ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత నటి శోభిత ధూళిపాళ సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఫుల్ స్పీడ్‌తో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘చీకటిలో’ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. సక్సెస్ జోష్‌తో ప్రస్తుతం కోలీవుడ్‌లో పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘వెట్టువమ్’లో ఆర్య సరసన ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోగా, తాజాగా, శోభిత కోలీవుడ్‌లో మరొక బంపర్ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరో రవి మోహన్, జిఎన్‌డి శ్యామ్ కుమార్ కాంబోలో రాబోతున్న చిత్రంలో శోభిత హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
ఒక థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రవి మోహన్ ఒక అకౌంటెంట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, ఆయనతో ఇప్పటికే ఒక స్పెషల్ ప్రోమో వీడియోను కూడా చిత్రీకరించారు. అయితే ఈ సినిమాకు ‘వైట్’ అనే టైటిల్‌ను పెట్టాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రవి మోహన్, శోభిత ధూళిపాళ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబోలో మరొక థ్రిల్లర్ సినిమా రాబోతుండటంతో అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






