- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘AA23’ హీరోయిన్ ఫిక్స్.. తాజాగా ఫొటోషూట్ కంప్లీట్ చేసుకున్న బ్యూటీ!
కూలీ తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు అల్లు అర్జున్ 23వ సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: కూలీ తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు అల్లు అర్జున్ 23వ సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్‌లో బన్నీ బిజీగా ఉండగా.. లోకేశ్ తన ‘AA23’ కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటున్నాడు. ప్రజెంట్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. అంతే కాకుండా.. లోకేశ్ కనగరాజ్ సహాయ దర్శకుల బృందం రెండుగా విడిపోయి.. ఒక బృందం హైదరాబాద్‌లోనూ, మరొక బృందం చెన్నైలోనూ పని చేస్తోందట. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో అల్లుఅర్జున్ సరసన క్రేజీ బ్యూటీ పూజాహెగ్డేను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ ఇటీవల పూజా తనకు సంబంధించిన ఒక ఫొటోషూట్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది. కాగా.. అల్లు అర్జున్, పూజా హెగ్డే కలయికలో ఇప్పటికే ‘దువ్వాడ జగన్నాథం’, ‘అల వైకుంఠపురం’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్నారని వార్తలు వస్తుండగా.. ఫ్యాన్స్ రకరకాలుగా స్పందస్తున్నారు.






