దళిత నాయకుని ఇంట్లో కేటీఆర్ సహపంక్తి భోజనం

by Batti.Sumithra |

మండలంలోని రంగపేటకు చెందిన బీఆర్ఎస్ దళిత నాయకుడు చిప్పకుర్తి నారాయణ ఇంట్లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సహపంక్తి భోజనం చేశారు.

దళిత నాయకుని ఇంట్లో కేటీఆర్ సహపంక్తి భోజనం
X

దిశ, లక్షెట్టిపేట : మండలంలోని రంగపేటకు చెందిన బీఆర్ఎస్ దళిత నాయకుడు చిప్పకుర్తి నారాయణ ఇంట్లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సహపంక్తి భోజనం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, విజిత్ రావు తదితర నాయకులు కూడా ఈ సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు కేసీఆర్ ఆధ్వర్యంలో మరింత అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story