- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Data Centres: ఏఐ బూమ్‌తో భారత్‌లో డేటా సెంటర్ల జోరు
2030 నాటికి దేశంలోని డేటా సెంటర్ల ఇన్‌స్టాల్‌డ్ కెపాసిటీ 2025లో ఉన్న 1.5 గిగావాట్ల నుంచి 6.5 గిగావాట్లకు, అంటే నాలుగు రెట్లకు పైగా పెరగనుందని రూబిక్స్ డేటా సైన్సెస్ నివేదిక వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో డేటా సెంటర్ రంగం భారీ విస్తరణ దశలోకి అడుగుపెట్టింది. క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ), 5జీ, ఈ-కామర్స్, యూపీఐ, ఓటీటీ వంటి డిజిటల్ సేవల వినియోగం వేగంగా పెరుగుతుండటంతో 2030 నాటికి దేశంలోని డేటా సెంటర్ల ఇన్‌స్టాల్‌డ్ కెపాసిటీ 2025లో ఉన్న 1.5 గిగావాట్ల నుంచి 6.5 గిగావాట్లకు, అంటే నాలుగు రెట్లకు పైగా పెరగనుందని రూబిక్స్ డేటా సైన్సెస్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 271 డేటా సెంటర్లు ఉండగా, వాటిలో దాదాపు 65 శాతం ముంబై, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాల పెట్టుబడులతో ఈ రంగంలో ప్రతిపాదిత పెట్టుబడులు 90 బిలియన్ డాలర్ల(రూ. 8.67 లక్షల కోట్ల)కు చేరడం విశేషం. ప్రపంచ డేటాలో దాదాపు 20 శాతం భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నప్పటికీ, ప్రపంచ డేటా సెంటర్ సామర్థ్యంలో దేశం వాటా ఇంకా 3-4 శాతమే కావడం వల్ల వృద్ధికి భారీ అవకాశం ఉందని రూబిక్స్ డేటా సైన్సెస్ పేర్కొంది. అయితే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే పెట్టుబడులతో పాటు ప్రాజెక్టులను వేగంగా అమలు చేసే సామర్థ్యమే పరిశ్రమకు అసలైన పరీక్షగా మారనుందని సంస్థ అభిప్రాయపడింది.






