- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad Family: అమెరికాలో విషాదం.. హైదరాబాద్ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఈ ప్రమాదంలో నాజియా భర్త షేక్ అబ్దుల్ నవీద్, ఏడేళ్ల కుమార్తె ఖతీజా షేక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని కాలిఫోర్నియాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని సైదాబాద్ వాని నగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. మృతులను నాజియా సల్మా (45), ఆమె కుమార్తె హఫీజా నేహా షేక్ (19), కుమారుడు హఫీజ్ ఒమర్ (14)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో నాజియా భర్త షేక్ అబ్దుల్ నవీద్, ఏడేళ్ల కుమార్తె ఖతీజా షేక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన విషయం మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు తెలియగా, కొంతసేపటి తర్వాత స్థానిక పోలీసులు సమాచారం అందించారు. కుటుంబం ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు, మరో వాహనం డ్రైవర్ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి అండగా ఉండేందుకు బంధువులను అమెరికాకు పంపించేందుకు సహాయం చేయాలని, అలాగే మృతదేహాలను స్వదేశానికి తరలించే ప్రక్రియలో సహకరించాలని బాధిత కుటుంబం కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలను కోరింది. మజ్లిస్ బచావో తెహ్రీక్ ప్రతినిధి అమ్‌జెదుల్లాహ్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జోక్యం చేసుకుని అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.






