- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రిష అమ్మవారు - విజయ్ రావణాసురుడు.. కేసు నమోదు
తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్‌లో ఉన్న ప్రసిద్ధ మారియమ్మన్ ఆలయంలో నిర్వహించిన ఆషాఢ మాస కార్యక్రమాలలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్‌లో ఉన్న ప్రసిద్ధ మారియమ్మన్ ఆలయంలో నిర్వహించిన ఆషాఢ మాస కార్యక్రమాలలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక బ్యానర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఆ భారీ బ్యానర్‌లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్()Vijayను రావణాసురుడి రూపంలో చిత్రీకరించగా, ఆయన కింద ప్రముఖ సినీనటి త్రిష(Trisha) ఫొటోను అమ్మవారి అవతారంలో ముద్రించారు. భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల్సిన పండగ వాతావరణంలో ఈ రకమైన వివాదాస్పద చిత్రాలతో కూడిన పోస్టర్ ప్రత్యక్షమవ్వడం స్థానికంగా పెద్ద ఎత్తున కలకలానికి దారితీసింది. ఈ పోస్టర్‌పై స్థానిక భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఉద్రిక్తతలకు కారణమైన ఆ వివాదాస్పద బ్యానర్‌ను అక్కడి నుంచి తొలగించారు. బ్యానర్ ఏర్పాటు చేసిన వారిలో ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.






