పర్యాటకులు అధికారుల సూచనలు పాటించాలి: సీతక్క

by Ajay Maddhiboyina |

ములుగు జిల్లాకు వచ్చే పర్యాటకులు అధికారుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని మంత్రి సీత‌క్క అన్నారు. పోలీసులు, అటవీ శాఖ నిర్దేశించిన పరిమితులు దాటి లోతైన అడవుల్లోకి వెళ్లకూడదని స్ప‌ష్టం చేశారు.

పర్యాటకులు అధికారుల సూచనలు పాటించాలి: సీతక్క
X

దిశ‌, వెబ్ డెస్క్: ములుగు జిల్లాకు వచ్చే పర్యాటకులు అధికారుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని మంత్రి సీత‌క్క అన్నారు. పోలీసులు, అటవీ శాఖ నిర్దేశించిన పరిమితులు దాటి లోతైన అడవుల్లోకి వెళ్లకూడదని స్ప‌ష్టం చేశారు. హెచ్చ‌రిక బోర్టులు పెట్టిన‌ప్ప‌టికీ నిషేధిత ప్రాంతాలకు వెళ్లి ఇప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందడం తీవ్ర విచారం కలిగించిందన్నారు. ప్రమాదకర కొండలు, వాగుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. పర్యాటకుల భద్రత కోసం జలపాతాల వద్ద బారికేడ్లు, రక్షణ ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

సురక్షిత ప్రాంతాల నుంచే ప్రకృతి అందాలు, మేడారం, రామప్ప ఆలయాలను సందర్శించి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉంటే వ‌ర్షాకాలం కావ‌డంతో ములుగు జిల్లాకు ప‌ర్యాట‌కులు భారీ త‌ర‌లివ‌స్తున్నారు. జిల్లాలోని, చుట్టుప‌క్క‌ల జిల్లాల నుండి ప‌ర్యాట‌కులు వ‌స్తుండ‌గా కొంద‌రు నిషేదిత ప్రాంతాల్లోకి వెళుతూ ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంటారు. జ‌ల‌పాతాల‌ను చూసేందుకు ప్రాణాల‌ను రిస్క్ లో పెడుతున్నారు. ప్ర‌తిఏడాది ప్ర‌మాదాలు జ‌రుగుతున్నా జ‌ల‌పాతాల వ‌ద్ద ప్ర‌మాద‌క‌రంగా ఫోటోలు దిగుతున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి సీత‌క్క వీడియో ద్వారా ప‌ర్యాట‌కుల‌కు ప‌లుసూచ‌న‌లు చేశారు.

Next Story