- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తనకు ఎలాంటి సర్జరీ జరగలేదు.. అమితాబ్ బచ్చన్ క్లారిటీ
తనకు ఎలాంటి సర్జరీ జరగలేదంటూ అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి గత రెండు రోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యంగా లేడని.. సర్జరీ చేయించుకున్నాడని కూడా ప్రచారం చేశారు. అయితే ఈ పుకార్లపై తాజాగా స్వయంగా అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి సర్జరీ జరగలేదని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ఇటీవల తాను రాసిన బ్లాగ్ పోస్టుకు తన ఆరోగ్యానికి సంబంధం లేదని ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని ఉద్దేశించి ఆ పోస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో అమితాబ్ బచ్చన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా సర్జరీ తర్వాత ఇంటికి వెళ్తుండటం.. మానసికంగా శారీరకంగా కష్టంగా ఉంటుంది అని అమితాబ్ అంతకుముందు ఓ పోస్ట్ పెట్టారు. ఛాంపియన్ కు ఏదో ఒక రోజు ఓటమి ఎదురవుతుందని పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన పోస్టు హెల్త్ గురించేనని వార్తలు వచ్చాయి. దీంతో సర్జరీ జరిగినట్లు జోరుగా ప్రచారం సాగింది. దీంతో ఆ పుకార్లపై అమితాబ్ క్లారిటీ ఇచ్చారు.






