- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ కె. హరిత
సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు.

దిశ, ఆసిఫాబాద్ : సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి రెవెన్యూ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాదా బైనమాల క్రమబద్ధీకరణ కింద దరఖాస్తు చేసుకున్న వాటిని రికార్డులతో సరిచూసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు చాలా మండలాల్లో ఇంకా పెండింగ్ దశలో ఉన్నాయని, తిరస్కరించే దరఖాస్తులకు తిరస్కరణకు గల కారణాలను నమోదు చేయాలని చెప్పారు.
జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 83.68 శాతం పూర్తయ్యిందని, ఈ నెల 25లోపు 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ, ఏఎస్‌డీ జాబితాను రూపొందించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ నితిక పంత్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 52 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉందని, ప్రమాదాలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు పెట్రోలింగ్, అంబులెన్స్ వాహనాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అనంతరం లారీ డ్రైవర్లకు కళ్లద్దాలను పంపిణీ చేశారు.






