Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం

by Kema Shiva Kumar |

అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన తల్లి, కుమారుడు, కుమార్తె మృతి చెందారు.

Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైన హృదయవిదారక ఘటన అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతులంతా ఐఎస్ సదన్ సమీపంలో ఉన్న వాణినగర్‌కు చెందిన వారిగా పోలీసులు, బంధువులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో తల్లి నజేయా (45), ఆమె కుమార్తె నిహాయీన్ (19), కుమారుడు ఉమర్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ప్రమాద సమయంలో కారులో ఉన్న భర్త షేక్ అబ్దుల్ నవీద్‌తో పాటు మరో కుమార్తె ఖదీజా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని తీవ్రంగా గాయపడిన నవీద్, ఖదీజాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో నగరంలోని వాణినగర్‌లో తీవ్ర విషాద‌ఛాయలు అలముకున్నాయి.

Next Story