'కూల్చివేశారు.. వ్యర్థాలు వదిలేశారు' కథనానికి నార్సింగి సర్కిల్ అధికారుల స్పందన

by Batti.Sumithra |   (  Updated:2026-07-21 17:20:10  IST  )

దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి నార్సింగి సర్కిల్ అధికారులు స్పందించారు.

కూల్చివేశారు.. వ్యర్థాలు వదిలేశారు కథనానికి నార్సింగి సర్కిల్ అధికారుల స్పందన
X

దిశ, గండిపేట: దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి నార్సింగి సర్కిల్ అధికారులు స్పందించారు. 'కూల్చివేశారు.. వ్యర్థాలు వదిలేశారు' అనే శీర్షికతో మంగళవారం నార్సింగి ప్రధాన రహదారిపై చాలా రోజులుగా ఉన్న వ్యర్థాల వ్యవహారంపై వివరాలతో ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్సింగి శానిటేషన్ విభాగం అధికారులు స్పందించారు. వ్యర్థాలు కూల్చివేతలకు సంబంధించినవి కావని, ప్రధాన రహదారిపై ఉన్న ల్యాన్సమ్ భవనం ఇంటీరియర్ పనుల నుంచి వచ్చిన వ్యర్థాలని వెల్లడించారు. సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపిన అధికారులు, జరిమానా కూడా విధించి వ్యర్థాలను వీలైనంత త్వరగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దిశ కథనంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story