- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలో తేజాసజ్జా జోరు.. రిలీజ్‌కు ముందే సినిమాకు భారీ డీల్!
చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మొదటి చిత్రం ‘జాంబిరెడ్డి’తోనే భారీ విజయం అందుకున్న ఈ యంగ్ హీరో.. తర్వాత వచ్చిన ‘హనుమాన్’, ‘మిరాయ్’తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ‘మిరాయ్ 2’, ‘జాంబిరెడ్డి 2’తో బిజీగా ఉన్నాడు. ఈ వరుస పాన్ ఇండియా విజయాలతో ఆయనకు నాన్- థియేట్రికల్ మార్కెట్‌లో ఉన్న క్రేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు ‘జాంబిరెడ్డి 2’ సెట్ పై ఉండగానే OTT డీల్ క్లోజ్ కావడం విశేషం. నాన్-థియేట్రికల్ హక్కులన్నీ కలిపి ఈ చిత్రం ఏకంగా రూ.45–50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఇక సినిమాలతో పాటు OTT ప్రపంచంలోనూ తేజ జోరుగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే తేజా సజ్జా అమెజాన్ కోసం చేసిన ఓ షో అక్టోబర్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ షో కోసం ఆయన భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. అలాగే.. మరో ప్రముఖ ఓటీటీ సంస్థతో కూడా తేజ ఓ ప్రత్యేక షో చేయడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. ఇదే జరిగితే డిజిటల్ స్పేస్‌లో ఆయన స్థాయి మరింత పెరగడం ఖాయం అని అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నారు సినీ విశ్లేషకులు.






