ఎన్ఎఫ్సీ నగర్ లో ఘనంగా సీత్లామాత పండుగ

by Taduka Kalyani |

ఎన్ఎఫ్సీ నగర్ లో గోర్ బంజారా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సీత్లా మాత పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

ఎన్ఎఫ్సీ నగర్ లో ఘనంగా సీత్లామాత పండుగ
X

దిశ, ఘట్కేసర్ః ఎన్ఎఫ్సీ నగర్ లో గోర్ బంజారా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సీత్లా మాత పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బ్యూటీ నెస్ట్ కాలనీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సీత్లా మాత విగ్రహాలకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, పల్లెలు పట్టణాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, సంప్రదాయ పద్ధతిలో బంజారాలు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమానికి హాజరైన ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో బంజారా నాయకులు డీజీ నాయక్, కృష్ణ నాయక్, మహిళలు పాల్గొన్నారు.

Next Story