- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో సంచలనం.. కోకా-కోలా Vs రియలన్స్ కాంపా
భారత కూల్ డ్రింక్స్ మార్కెట్‌లో రిలయన్స్ 'కాంపా' సంచలనం సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన కోకా-కోలా (Coca-Cola), పెప్సికో (Pepsico) బ్రాండ్లకు గట్టిపోటే ఎదురవుతోంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కాంపా (Campa) అనతికాలంలోనే ఎదిగి సేల్స్‌లో దూసుకెళ్తోంది. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కోకా-కోలా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా, తక్కువ ధరలు డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ మార్జిన్లు ఇచ్చే వ్యూహంతో ‘కాంపా’ వేగంగా మార్కెట్ వాటాను విస్తరిస్తోంది. తాజాగా మార్కెట్ వర్గాల ప్రకారం.. కోకా-కోలా 40 శాతం నుంచి 42 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదేవిధంగా పెప్సికో 28 శాతం నుంచి 30 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. ఇక కాంపా మార్చి 2023లో రీలాంచ్ అయిన స్వల్పకాలంలోనే ఏకంగా 7 శాతం నుంచి 8 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుని మూడో అతిపెద్ద బ్రాండ్‌గా నిలిచింది.
పక్కా వ్యూహంతో ముందుకు ‘కాంపా’
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తమ ‘కాంపా’ డ్రింక్స్‌ను సామాన్యులకు అందుబాటులో ఉండేలా మార్కెట్‌లోకి తెచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు ఎక్కువ కమిషన్లు ఇవ్వడం, అలాగే రిలయన్స్ రిటైల్ నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో వాడుకోవడంతో కాంపా విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కాంపా ఏకంగా రూ.2,900 కోట్లకు పైగా విక్రయాలను నమోదు చేయడం విషేశం. ఈ తీవ్రమైన పోటీతో పెప్సికో మార్కెట్ వాటాపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ, దేశంలోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కలిగిన కోకా-కోలా మాత్రం తట్టుకుని ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.






