- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పొంగిన తాలిపేరు ప్రాజెక్టు
by Ratna Kumari |
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరుతోంది.

X
దిశ, చర్ల : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు మంగళవారం 15 గేట్లను ఎత్తి 10,738 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు మరింత వరదనీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి మరిన్ని గేట్లు ఎత్తే అవకాశముందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు పరిధిలో వరి సాగు చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story






