ఆటో పై నుంచి పడి బాలుడు మృతి

by Jakkula.Mamatha |

మల్దకల్ మండలం, పాల్వాయి గ్రామానికి చెందిన ఒక ఆటో మల్దకల్ పశువుల సంతకని బయలుదేరగా అదే గ్రామానికి(పాల్వాయి) చెందిన రంగముని అనే బాలుడు ఆటో పైన ఎక్కి కూర్చున్నాడు.

ఆటో పై నుంచి పడి బాలుడు మృతి
X

దిశ, మల్దకల్: మల్దకల్ మండలం, పాల్వాయి గ్రామానికి చెందిన ఒక ఆటో మల్దకల్ పశువుల సంతకని బయలుదేరగా అదే గ్రామానికి(పాల్వాయి) చెందిన రంగముని అనే బాలుడు ఆటో పైన ఎక్కి కూర్చున్నాడు. కాగా పెద్దపల్లి సమీపంలో ఆటో డ్రైవర్ బ్రేక్ తొక్కడంతో ఆటో పైన ఉన్న బాలుడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి మల్దకల్ పోలీసులు చేరుకుని బాలుడి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్దకల్ ఎస్సై శ్రీహరి తెలిపారు.

Next Story