- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు ఢీకొని మహిళ మృతి.. యువకుడికి తీవ్ర గాయాలు
గండీడ్ మండల పరిధిలోని గొల్లగడ్డ గేట్ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్: గండీడ్ మండల పరిధిలోని గొల్లగడ్డ గేట్ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కపులాపూర్ గ్రామానికి చెందిన మాలికాడి బుగ్గమ్మ, అశోక్ మంగళవారం ఉదయం సుమారు 7:15 గంటలకు కోసిగి నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గొల్లగడ్డ గేటు వద్ద వెనుక నుంచి వచ్చిన షిఫ్ట్ డిజైర్ కారు (రిజిస్ట్రేషన్ నం. TG 38 T 1707) అతివేగంగా వచ్చి వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి వారిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో మాలికాడి బుగ్గమ్మ గాయాల తీవ్రతకు తాళలేక మృతి చెందింది. అశోక్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌గా మద్దూరు మండలం దోరేపల్లి గ్రామానికి చెందిన ఇరారం శ్రీను ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతురాలి మేనల్లుడు మాలికాడి రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ కొనసాగుతోంది.






