- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీతక్కకు హైకోర్టులో ఊరట.. క్రిమినల్ కేసు కొట్టివేత
మంత్రి సీతక్కకు హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్-19 సమయంలో ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరాహార దీక్షకు సంబంధించి ఆమెపై నమోదైన క్రిమినల్ కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి సీతక్కకు హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్-19 సమయంలో ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరాహార దీక్షకు సంబంధించి ఆమెపై నమోదైన క్రిమినల్ కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. 2021 ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోగ్యశ్రీలో కొవిడ్ చికిత్సను చేర్చాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు.
పోలీసుల అనుమతి లేకుండా, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ గాంధీనగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 188, 269, 270, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51(బి) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, కోర్టు దానిని విచారణకు స్వీకరించింది. కింది కోర్టు చర్యలను సవాల్ చేస్తూ సీతక్క హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి.. సీతక్కపై కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి తగిన చట్టపరమైన ఆధారం లేదని స్పష్టం చేశారు. ఎక్సైజ్ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ సీసీ నెం.308/2024 కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.






