వీరశైవ సమాజం సభ్యుల ఆందోళన.. కలెక్టర్‌కు వినతి

by Batti.Sumithra |

కంది మండల పరిధిలోని కాశీపూర్‌లో వీరశైవ భవన్‌కు సంబంధించిన భూమి అన్యాక్రాంతానికి గురవుతున్న విషయంపై వీరశైవ సమాజం సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

వీరశైవ సమాజం సభ్యుల ఆందోళన.. కలెక్టర్‌కు వినతి
X

దిశ, సంగారెడ్డి అర్బన్: కంది మండల పరిధిలోని కాశీపూర్‌లో వీరశైవ భవన్‌కు సంబంధించిన భూమి అన్యాక్రాంతానికి గురవుతున్న విషయంపై వీరశైవ సమాజం సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వీరశైవ సమాజం సభ్యులు కలెక్టర్‌కు భూమికి సంబంధించిన సమస్యను వివరించారు. కాశీపూర్‌లో ఉన్న వీరశైవ భవన్ స్థలం ఇతరుల పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింలు, సలహాదారులు వెన్న చక్రేశ్వర్, అడివప్ప, కోశాధికారి వినోద్ కుమార్, సతీష్, పట్లోళ్ల అశోక్, సంతోష్ పాటిల్, సాగర్, శివకుమార్, పట్లోళ్ల నాగేశ్వర్ పాటిల్, నాగరాజు, శేఖర్, ప్రశాంత్, అభినయ్ కుమార్, కిరణ్ కుమార్, విద్యాసాగర్, భవాని, భవానీ ప్రసాద్, కిరణ్ నరేందర్, నాగరాజు, రాములు, ప్రకాష్, నరేందర్‌తో పాటు మహిళా ప్రతినిధులు అరుణ, శారద, వసంత తదితరులు పాల్గొన్నారు.

Next Story