- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి : ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డీ.వీ. శ్రీనివాస రావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డీ.వీ. శ్రీనివాస రావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి, వివిధ రికార్డులు, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, కేసు డైరీలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం వంటి కారణాలతో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని, నేరస్తుల కదలికల పై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు (వీపీఓలు) తమ పరిధిలోని గ్రామాల్లో సైబర్ నేరాల పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు, ఫేక్ లింకుల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు విస్తృతంగా చేపట్టాలని ఎస్పీ సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించేందుకు, నేరాల దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు రంగా కృష్ణ, సందీప్ రెడ్డి, ఎస్‌ఐలు రంజిత్ రెడ్డి, జగన్మోహన్, కృష్ణయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






