- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
40 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చండి.. ఎన్‌సీబీసీ చైర్‌పర్సన్‌ను కోరిన వి.హనుమంతరావు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 40 వెనుకబడిన తరగతుల (బీసీ) కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 40 వెనుకబడిన తరగతుల (బీసీ) కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం న్యూఢిల్లీలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సీబీసీ) చైర్‌పర్సన్ సాధ్వి నిరంజన్ జ్యోతితో సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన 40 బీసీ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలనే దీర్ఘకాలిక ప్రతిపాదనను సాధ్వి నిరంజన్ జ్యోతికి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో మినహాయించడం వల్ల తెలంగాణ యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లను కోల్పోతున్నారని వీహెచ్ వివరించారు. ఈ కులాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల ఫలాలు అందేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీహెచ్ అందజేసిన వినతిపత్రంపై ఎన్‌సీబీసీ చైర్‌పర్సన్ సాధ్వి నిరంజన్ జ్యోతి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ఓబీసీలకు కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.






