- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దూసుకుపోతున్న ‘లెనిన్’.. మరో మార్క్ అందుకున్న అఖిల్!
by velandi.Saikiran |
యూఎస్ మార్కెట్ లో ‘లెనిన్’ మరో మార్క్ అందుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: అఖిల్ అక్కినేని లేటెస్ట్ గా చేసిన సినిమా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్ హీరోగా చేయగా ఆయన సరసన భాగ్యశ్రీ మెరిశారు. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ కథనే ఈ లెనిన్. కథ ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతంగా ఉన్న నేపథ్యంలో బంపర్ హిట్ అందుకుంది. పది రోజుల వ్యవధిలోనే రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఇప్పటికి కూడా విజయవంతంగా థియేటర్లలో నడుస్తోంది లెనిన్. ఈ నేపథ్యంలోనే అఖిల్ ఖాతాలో మరో రికార్డు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యుఎస్ మార్కెట్ లో ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. నార్త్ అమెరికాలో లెనిన్ సినిమా ఎనిమిది లక్షల డాలర్లు క్రాస్ చేసింది. ఈ మేరకు చిత్ర బృందం కూడా వెల్లడించింది. ఈ ఊపు ఈ నెల చివరి వరకు ఉంటుందని చెబుతున్నారు.
- Tags
- Akhil
- Lenin Movie
Next Story






