ఆర్టీసీ బస్సులో మహిళ పర్సు కట్.. బంగారం, నగదు చోరీ

by Ratna Kumari |

కల్లూరు–రామకృష్ణాపురం మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని దొంగలు మహిళ పర్సును బ్లేడ్‌తో కట్ చేసి బంగారం, నగదు అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్టీసీ బస్సులో మహిళ పర్సు కట్.. బంగారం, నగదు చోరీ
X

దిశ, కల్లూరు : కల్లూరు–రామకృష్ణాపురం మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని దొంగలు మహిళ పర్సును బ్లేడ్‌తో కట్ చేసి బంగారం, నగదు అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై హరిత తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో రామకృష్ణాపురానికి చెందిన ఐతరాజు సుమలత కల్లూరు బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో రామకృష్ణాపురానికి ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఆమె వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను గుర్తుతెలియని దుండగులు బ్లేడ్‌తో కట్ చేసి, అందులో ఉన్న పర్సును అపహరించారు.

ఆ పర్సులో సుమారు 23 గ్రాముల బంగారు గొలుసుతో పాటు రూ.9 వేల నగదు ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గమ్యస్థానానికి చేరుకున్న అనంతరం పర్సు కనిపించకపోవడంతో చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్, బస్సులో ప్రయాణించిన వారి వివరాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story