- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుకునూర్ పల్లిలో శ్రీరాముని తలంబ్రాల పంపిణీ
by Batti.Sumithra |
సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలోని నూతన వారాహి అమ్మవారి ఆలయంలో భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాలను 'భక్తిరత్న' రామకోటి రామరాజు భక్తులకు పంపిణీ చేశారు.

X
దిశ, కొండపాక : సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలోని నూతన వారాహి అమ్మవారి ఆలయంలో భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాలను 'భక్తిరత్న' రామకోటి రామరాజు భక్తులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో లక్ష మంది భక్తులతో 300 కిలోల గోటి తలంబ్రాలు తయారు చేయించి భద్రాచలానికి సమర్పించామని, అక్కడ నుండి తెచ్చిన 100 కిలోల ముత్యాల తలంబ్రాలను ఇక్కడ అందిస్తున్నామని ఆయన తెలిపారు. రామరాజు సేవలను కొనియాడుతూ వారహి మాత ఆలయ కమిటీ చైర్మన్ మమతమ్మ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ రామప్ప, కాసం నవీన్ కుమార్, పిష్క అమరేందర్, కాపర్తి శ్రీనివాస్, గంగిశేట్టి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Next Story






