దోస్త్' స్పెషల్ ఫేజ్‌ ప్రవేశాలకు 26 వరకే అవకాశం

by Taduka Kalyani |

తెలంగాణ దోస్త్ 2026-27 స్పెషల్ ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్ జహన్ ఒక ప్రకటనలో తెలిపారు.

దోస్త్ స్పెషల్ ఫేజ్‌ ప్రవేశాలకు 26 వరకే అవకాశం
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: తెలంగాణ ఉన్నత విద్యామండలి(టిజిసీహెచ్ఈ) ఆధ్వర్యంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ 2026-27 స్పెషల్ ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్ జహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దోస్త్ లో నమోదు చేసుకుని సీటు పొందని విద్యార్థులు తమ పాత దోస్త్ ఐడి పిన్ తో స్పెషల్ ఫేజ్‌ లో పాల్గొనవచ్చని, అలాగే ఇప్పటివరకు నమోదు చేసుకోని విద్యార్థులు 400 రూపాయల నమోదు రుసుము చెల్లించి కొత్తగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. స్పెషల్ ఫేజ్‌ లో వెబ్ ఆప్షన్ల నమోదు ఈనెల 27 వరకు కొనసాగుతుందని, సీట్ల కేటాయింపు ఈనెల 30 న విడుదల చేయనున్నట్లు, సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 30 నుంచి ఆగస్టు 1 వరకు ఆన్‌ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, అనంతరం ఈనెల 31 నుంచి ఆగస్టు 1 వరకు సంబంధిత కళాశాలల్లో హాజరై ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే సీసీఓటిపీ ద్వారా సీటు ను ధృవీకరించుకున్న విద్యార్థులు స్పెషల్ ఫేజ్‌ కు అర్హులు కాదని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులు సీటు పొందే అవకాశాలను పెంచుకోవడానికి ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని సుచిస్తూ, ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

Next Story